Handri Neeva : హంద్రీ నీవా కు నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
హంద్రీనీవా ఫేజ్-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్లో రెండు మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్ మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్‌లను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూపాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu), ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), ఎంపీ బైరెడ్డి శబరి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













