Chandrababu: ఎంతమంది పిల్లలుంటే .. అంతమందికీ : సీఎం చంద్రబాబు
ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. కూటమి పాలనకు నేటితో ఏడాయి పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్ (Minister Lokesh)తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం (Thalliki Vandanam) అమలు చేస్తున్నామని చెప్పారు. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం. తల్లికి వందనం పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తు న్నాం . దీనికోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో 1,346 కోట్లు పాఠశాల (Schools)ల అభివృద్ధికి వెళ్తుంది. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నాం. అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే, ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం ఇస్తున్నాం అన్నారు. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో జమచేస్తాం. అనాథలకు జిల్లా కలెక్టర్ (District Collector) నిర్ధారించిన ప్రకారం వారి ఖాతాల్లో వేస్తాం. తల్లికి వందనం జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. ఎడ్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరిద్ది సహాయం అందిస్తాం. దానికోసం జూన్ 26 వరకు ఫిర్యాదులు స్వీకరించి 30న తుది జాబితాను ప్రకటిస్తాం అని తెలిపారు.













