మే 23న తరువాత ప్రమాణ స్వీకారం చేస్తా
రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఊహలకు అందని నిశ్శబ్ద విప్లవం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అది మీ ఊహకు అందని విప్లవమని తెలిపారు. విజయం ప్రజలు ఇస్తారని తెలిపారు. టీడీపీ ఎన్ని సీట్లలో గెలుస్తుందో మీరే చూస్తారుగా అని వ్యాఖ్యానించారు. మే 23 తరువాత మంచి రోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. జగన్‌కు ఓటే వేయడానికి ఇంతమంది పోలింగ్ కేంద్రాలకు వచ్చారేని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గుడు వస్తే. అరాచకాలే అని భయపడి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు వచ్చారని వివరించారు. పైకి చెబితితే ఈ దుర్మార్గుడితో ఇబ్బందులు వస్తాయని అందరూ గుంభనంగా ఉన్నారన్నారు. చావడం, చపండం వారిచ్చిన నినాదాలని గుర్తు చేశారు. జగన్ ఎక్కడ మాట్లాడినా ఇటువంటి మాటలే మాట్లాడుతున్నారన్నారు. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా తప్పు ఒప్పుకున్నాడా అని ప్రశ్నించారు. వితండవాదం చేసే వ్యక్తికి మనం సర్దిచెప్పగలమా అని వ్యాఖ్యానించారు.













