Chandrababu: కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు చంద్రబాబు ప్రశంసలు
విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ (Harendhira Prasad)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రశంసించారు. యోగా డేను ఘనంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారని అభినందించారు. యోగా డే (Yoga Day) నిర్వహణలో కలెక్టర్ కృషి, ప్రణాళిక అమలుకు సీఎం కితాబిచ్చారు. కార్యక్రమం విజయవంతం కావడంలో అధికారులు కీలక పాత్ర పోషించారని, కూటమి నేతలు సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర (Yoga Andhra) వేడుకలో 3,02,087 మంది పాల్గొన్నారని ప్రభుత్వం నిర్ధారించింది. ఒకేసారి రెండు గిన్నిస్ రికార్డులు (Two Guinness records) సృష్టించటం ఇదే ప్రథమమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి కూడా కరుణించిందన్నారు. 20 రోజుల క్రితం వర్షం పడుతుందనే సమాచారంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. ఇంత పెద్ద వేడుకను చిన్న ఇబ్బంది కూడా లేకుండా సాంకేతికత సాయంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.













