Global Medcity : అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీ : చంద్రబాబు
రాజధాని అమరావతి(Amaravati) లో గ్లోబల్ మెడ్సిటీ (Global Medcity ) ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) తెలిపారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రుల (Hospitals) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడిరచారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశాం. కొన్నిచోట్ల గుండెజబ్బులు, డయాబెటిస్ (Diabetes), హైపర్టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్టెన్షన్ అధికంగా కనిపిస్తోంది. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉంది అని అన్నారు.













