Chandrababu: వాసవీ కన్యకాపరమేశ్వరికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) పర్యటించారు. స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు(Ramanaidu) , ఎమ్మెల్యేలు(MLAs), ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయాని (Vasavi Kanyakaparameshwari Temple )కి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధానార్చకులు, అధికారులు(Officials), సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.













