అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే భోజనం చేశారు. పేదలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. మిగతా ప్రాంతాల్లో శుక్రవారం మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.













