రాజధానిలో నిర్మాణాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ భవనాల నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో పాటు ఆమె సోదరి కుటుంబ సభ్యులు పరిశీలించారు. రాయపూడి పరిధిలో నిర్మిస్తున్న ఏఐఎస్ అధికారుల భవనం సహా అఖిలభారత సర్వీసు అధికారుల నివాస సముదాయంలో సిద్ధం చేసినా నమూనా ఫ్లాట్, శాశ్వత సచివాలయం, ఇటీవల నిర్మించిన రాఫ్ట్ కాంక్రీటు ఫౌండేషన్ పనులనూ పరిశీలించారు. తాత్కాలిక హైకోర్టు భవనాన్ని, ఎన్జీవోల భవన సముదాయాలను తిలకించారు. అఖిలభారత సర్వీసు అధికారుల భవనంలోని నమూనా ఫ్లాట్‌ను తిలకించిన ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయిలో నిర్మిస్తున్న భవనాలకు దీటుగా ఇంటీరియల్ డెకరేషన్ ఉందని ప్రశంసించారు.













