ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల సాకారమవుతున్న వేళ
కళ్ళు చెదిరే రీతిలో అమరావతి రాజధాని నిర్మాణం అమరావతి రాజధాని స్పీడ్ యాక్సిస్ రోడ్డును విజయవాడ యువత హ్యాపీ సండే, అమరావతి మారథాన్ ల కోసం చక్కగా ఉపయోగించుకుంటున్నారు, అనందం, సంతోషాలను పంచుకుంటున్నారు… ఆంధ్రుల రాజధాని అమరావతికి ప్రథమ అంబాసిడర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…అయితే రాజధాని నిర్మాణాలు చూడటం ఒకెత్తయితే ప్రతి ఆంధ్రుడూ ఒక అంబాసిడర్ కావాలి…మన గొప్పదనాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్ కు బాటలు వేయాలి…ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పెంచడంలో ప్రతి ఆంధ్రుడూ భాగస్వామ్యం కావాలి…
రాజధాని నిర్మాణంపై ప్రతిపక్షాల వదంతులను విశ్వసించని ప్రజలు
అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సమర్థులు, పరిపాలనాదక్షులు, అయిదున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల హుందాతనానికి నిదర్శనంగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిది…ప్రపంచంలోనే అయిదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా 2050నాటికి తీర్చిదిద్దనున్న సమర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో జోరుగా సాగుతున్న భవన నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించారు. నిర్మాణం పూర్తయి నివాసానికి సిద్ధం చేసిన అఖిల భారత సర్వీసు అధికారుల భవన లోపలి భాగాన్ని మరోసారి ప్రత్యక్షముగా పరిశీలించారు. ప్రధానంగా ఫిబ్రవరి మూడున రాజధాని పరిధిలో విధులు నిర్వహించడానికి సిద్ధమైన కోర్టు భవనాలను సైతం సందర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లను బయట నుంచే పరిశీలించారు. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో వేగంగా జరుగుతున్న నిర్మాణ పనుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సీఆర్ డీఏ అదనపు కమిషనర్ సగిలి షన్మోహన్, సీఈ ఎంవీ రావులు రాజధానిలో జరుగుతున్న పనుల వివరాలు అందజేశారు. నాణ్యతకు డోకా లేకుండా పనులు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు మరోసారి స్పష్టం చేశారు.
రూ.41,297 కోట్లతో రాజధాని పనులు
అమరావతి నిర్మాణానికి రూ.1.09లక్షల కోట్లతో అంచనాలు రూపొందించి తొలిదశలో రూ.51,687 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. ప్రస్తుతం రూ.41,297 కోట్లతో పనులు సాగుతున్నాయి. శాశ్వత హైకోర్టు, శాసనసభ భవనాలను రెండేళ్లలో నిర్మిస్తారు. సచివాలయ భవన నిర్మాణం వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పూర్తవుతుంది. ఎమ్మెల్యేలు సహా వివిధ వర్గాలకు చేపట్టిన అపార్టుమెంట్ల నిర్మాణం తుది దశకు చేరింది.













