Chandrababu: ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు (Free bus) ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు (Employees) కూడా ప్రతినెలా మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 రైతు బజారులు ఉన్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు బజార్లకు సేంద్రియసాగులో పండిరచిన కూరగాయాలు వచ్చేలా చూస్తామన్నారు. ప్రపంచం గర్వించేలా విశాఖలో యోగా డే (Yoga Day) నిర్వహిస్తాం. ప్రధాని మోదీ (Prime Minister Modi) కూడా వస్తున్నారు. యోగా డేను నెలరోజులపాటు నిర్వహిస్తాం. ప్రజలకు శిక్షణ ఇస్తాం. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని కోరుతున్నాం. ఆఫ్లైన్, ఆన్లైన్లో యోగా శిక్షణ ఇస్తాం అని అన్నారు.













