తెలుగుదేశం పార్టీ మానిఫెస్టో ను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీపై 37ఏళ్లుగా ప్రజాదరణ. 22ఏళ్లు అధికారంలో టిడిపి ఉండటం చరిత్ర. టిడిపి పట్ల ప్రజల్లో ఉన్న విశ్వసనీయత, నమ్మకం. 2004-14 ఉమ్మడి రాష్ట్రంలో చీకటి దశాబ్దం. రైతులు,మహిళలు,యువత దుస్థితి. పాదయాత్రలో ప్రజల కష్టాలు, చలించిపోయాను. అప్పట్లో రోజుకు కరెంట్ అర్ధరాత్రి పూట మూడున్నర గంటలు. పాముకాట్లకు 4వేలమంది, కరెంట్ షాక్ లకు 4వేల మంది బలి. 24వేల మంది రైతుల ఆత్మహత్యలు. రోజుకు 48మంది,ప్రతి అరగంటకు ఒక రైతు పిట్టల్లా రాలిపోయారు.
పాదయాత్రలో రైతులకు రుణమాఫీ ప్రకటించాను. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తానని చెప్పాను. గత 5ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు. రూ.24,500కోట్ల రైతురుణ ఉపశమనం ఒక చరిత్ర. 55లక్షల మందికి రైతు కుటుంబాలకు లబ్ది. ‘‘అన్నదాత సుఖీభవ’’ పథకం తెచ్చాం. దాదాపు 60లక్షల రైతు కుటుంబాలకు లబ్ది. బిజెపిలో రైతు ఆదాయాలు రెట్టింపు అన్నారు ఘోరంగా విఫలం. తమిళనాడు,మహారాష్ట్ర,ఢిల్లీలో రైతుల మార్చ్ లు, మధ్యప్రదేశ్ లో పోలీసు కాల్పుల్లో 5గురు రైతుల బలి.
కోటి మంది చెల్లెళ్లకు ‘‘పసుపు-కుంకుమ’’. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.20వేలు-రూ.21వేల కోట్లు. ‘పసుపు-కుంకుమ’కు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. 5ఏళ్లలో రూ.లక్ష కోట్ల సంక్షేమం. యువత ఉద్యోగాల కల్పన. పెట్టుబడులు రాబట్టాం. ఉద్యోగాలు కల్పించాం. వరుసగా 3సమ్మిట్ లు-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నెంబర్ 1. గత 5ఏళ్లలో 9లక్షల ఉద్యోగాలు. రూ.16లక్షల కోట్ల పెట్టుబడులు, 30లక్షల ఉద్యోగాల కల్పన
ఎంవోయూలు.
ఐటి రంగంలో 2లక్షల ఉద్యోగాలు,ఎలక్ట్రానిక్స్ రంగంలో 3లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టాం. లక్ష ఉద్యోగాల పైగా తెచ్చాం. మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ హబ్. 5ఏళ్లలో ఏపిలో 36లక్షల ఫోన్లు తయారు. దేశంలో తయారయ్యే ప్రతి 5ఫోన్లలో 1 ఏపిలోనే. యువత నైపుణ్యాభివృద్ధి. ఉపాధి వచ్చేదాకా ప్రతినెలా భృతి రూ.1,000-దానిని రూ.2వేలకు పెంచా. బీసీలకు రూ.43వేల కోట్లు, ఎస్సీలకు రూ.40వేల కోట్లు, ఎస్టీలకు రూ.14వేల కోట్లు. ముస్లిం మైనారిటిలకు రూ.4వేల కోట్లు బడ్జెట్.
బీసి భవన్ ల నిర్మాణం, బీసిలకు ప్రత్యేక బడ్జెట్, బిసి విద్యార్ధుల విదేశీవిద్య,స్కాలర్ షిప్ లు, ఫీజులు, ఆదరణ -2 కింద 8లక్షల కుటుంబాలకు అండగా ఉన్నాం. ఎస్సీలకు, ఎస్టీలకు జగజ్జీవన్ జ్యోతి, 100యూనిట్ల ఉచిత విద్యుత్. విదేశీవిద్యకు రూ.10లక్షలు. కార్పోరేషన్ బడ్జెట్ 4రెట్లు పెంచాం. ముస్లింల బడ్జెట్ 4రెట్లు. ఇమామ్ లు, మౌజన్ లకు వేతనాలు. దుల్హన్ కింద రూ.50వేలు. స్వయం ఉపాధికి ప్రోత్సాహం.
ఎల్ ఈడి బల్బులు,జగజ్జీవన్ జ్యోతి, రైతు రథాలు (ట్రాక్టర్లు),అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ. రూ.10కోట్లతో డ్రైవర్ల సాధికార సంస్థ, జీవిత కాల పన్ను తొలగింపు. అంగన్ వాడి, ఆశా వర్కర్లు,హోంగార్డులు,చిరుద్యోగుల వేతనాల పెంపు. 5ఏళ్లలో ఇన్ని చేసిన పార్టీ దేశచరిత్రలో లేదు.
మేనిఫెస్టో హామీలు 100% నెరవేర్చిన ఘనత టిడిపిదే. ప్రజాదరణ, రెట్టించిన స్ఫూర్తితో 2019ఎన్నికల మేనిఫెస్టో తయారీ. ఇందులో మరిన్నో వినూత్న పథకాలు. గత ఎన్నికల్లో ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కంటె రెట్టింపు విశ్వాసం,నమ్మకం తెలుగుదేశం పార్టీ పట్ల… టిడిపి మిషన్ 150ప్లస్ మా టార్గెట్-25ఎంపీ సీట్లు. 150పైగా అసెంబ్లీ సీట్లలో ఘన విజయం తథ్యం. 2019 మేనిఫెస్టో 100% అమలు చేస్తాం. చెప్పనివి కూడా రెట్టింపు చేస్తాం(అంటే సెంచరీ, 100కు పైగా) ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో అన్ని అంశాలను అమలు చేయిస్తాం. మోది, షాల బిజెపికి బుద్ది చెబుతాం.కేంద్రంలో రాబోయేది కొత్త ప్రధానే. ఏపి ప్రయోజనాలు కాపాడతాం. 5కోట్ల ప్రజల హక్కులు సాధిస్తాం.













