అర్హులకు పెన్షన్లు ఇస్తున్నాం: చంద్రబాబు
అర్హులకు పెన్షన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు ప్రతి సంవత్సరం తన స్వంత గ్రామమైన నారావారిపల్లె సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాతీగా పాటిస్తున్నారు. అందులోభాగంగా ఈ యేడాది కూడా నారావారిపల్లె నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. ‘‘జిల్లాలో సమస్యలు చాలా వరకు తగ్గాయి. దేశంలో లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ధనిక రాష్ట్రాలు కూడా చేయలేని పథకాలు అమలు చేశాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తున్నాం. ఉద్యానవన పంటల ద్వారా ఆదాయం, ఆరోగ్యం. గ్రామాల్లో ఎటు చూసినా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. మట్టిపై నడవడం కూడా ఆరోగ్యానికి మంచిది’’ అని చంద్రబాబు సూచించారు.













