పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు భేటీ
అమరావతి సచివాలయంలో సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం తమ మూడో అభ్యర్థిని నిలబెట్టదని ప్రచారం ఉన్నా, అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి సృష్టతను అధిష్టానం ఇవ్వలేదు. పార్టీ తరపున ఇద్దరినే నిలబెట్టాలా లేది మూడో అభ్యర్థిని కూడా బరిలో దించాలా అనే అంశాలపై ఓ సృష్టత వచ్చాక అప్పుడు అభ్యర్థులు ఎవరనే దానిపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి లేదా రేపు అర్థరాత్రి లోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.













