నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు
ఏలూరు, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడివిడిగా భేటీ అయ్యారు. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే నర్సాపురం అభ్యర్థిగా మాధవనాయుడు, పాలకొల్లు అభ్యర్థిగా రామానాయుడు, ఆచంటకు పితాని సత్యనారాయణ, ఉండి అభ్యర్థిగా శివరామరాజు, తణుకు అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ, దెందులూరు అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్, ఉంగటూరుకు గన్ని వీరాంజనేయులు ఖరారైనట్లు సమాచారం. భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, చింతలపూడి, పోలవరం, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం రానట్లు సమాచారం.













