దేశంలోనే ఏపీ నెంబర్‌వన్ గా ఉంది
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పాలనలో వినూత్న మార్పులు- చేర్పులు తెచ్చామని వెల్లడించారు. అందువల్లే నరేగాలో ఏపీకి 10 జాతీయ అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. జవాబుదారీతనంలేని పాలనను కాంగ్రెస్ హయాంలో చూశామని అన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులందరికీ న్యాయం చేశామని ప్రకటించారు.













