Chandrababu: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు : చంద్రబాబు
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించబోతున్న యోగా దినోత్సవ (Yoga Day) ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు (Krishna Babu) సీఎంకు వివరించారు. భద్రత ఏర్పాట్లపై డీజీపీ హరీశ్గుప్తా (DGP Harish Gupta) వివరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆఫ్లైన్ (Offline) , ఆన్లైన్ (online) లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పదేళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలి. సెక్రటేరియట్ యూనిట్ సిబ్బంది పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలి. క్షేత్రస్థాయిలో ఇతర సిబ్బందిని ఏర్పాటు చేస్తే జవాబుదారీ ఉండదు. సెక్రటేరియట్ సిబ్బంది. పోలీసులు సమన్వయంతో పని చేయాలి. యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నాం. దాదాపు 3.4 లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు.













