Chandrababu: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చిన చంద్రబాబు

పల్నాడు (Palnadu) జిల్లా మాచర్ల (Macherla) లో నిర్వహించిన స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్తను ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజావేదిక బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. మార్గదర్శి- బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం అయ్యారు.