CM Chandrababu :మోడల్ నియోజకవర్గంగా కుప్పం : సీఎం చంద్రబాబు
మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని (Kuppam Constituency) తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. కుప్పంలోని టీడీపీ కార్యలయంలో జననాయకుడు (jananayakudu portal) పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అన్ని ప్రాంతాలతో సమానంగా, అవసరమైతే మిన్నగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు జననాయకుడు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేయవచ్చు. వాట్సప్ (WhatsApp) ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చు. వాటిని పోర్టల్‌లో నమోదు చేసి విశ్లేషించి పరిష్కారం చూపుతాం. స్థానిక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం విషయంలో నాపై ప్రత్యేక బాధ్యత ఉంది. ఇక్కడి ప్రజలు వరుసగా 8 సార్లు గెలిపించారు. సీంగా ఉన్నందున అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఏ అర్జీ వచ్చినా సమయంలో పరిష్కార మార్గం చూపిస్తా. ఇది వినూత్న ప్రయోగం అని అన్నారు.













