వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో జేసీబీ ఎక్కి నాలుగు గంటలుగా వరద ప్రభావిత కాలనీలను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా బాధితులను పరామర్శిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆహారం అందుతుందా లేదా అని బాధితులను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. కాలనీల్లో చివర ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై చంద్రబాబు ఆరా తీశారు.













