Amaravati website: ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్ ఆవిష్కరించిన చంద్రబాబు

అమరావతి ప్రాంతం పాత్రికేయులు రూపొందించిన ప్రెస్‌క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్ (Amaravati website) ను రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆవిష్కరించారు. అమరావతి ప్రెస్‌క్లబ్ కమిటీకి, పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి అమరావతిలో స్థలం కేటాయించాలని పాత్రికేయులు కోరగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు ఆలోచనల స్ఫూర్తి తోనే ఈ ప్రెస్‌క్లబ్ పురుడుపోసుకుందని పాత్రికేయులు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అప్పాజీ (Appaji) , ప్రధాన కార్యదర్శి సతీశ్‌బాబు, ఉపాధ్యక్షుడు నారాయణ (Narayana,) కోశాధికారి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.