Amaravati : అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన
నవ్యాంధ్ర రాజధాని అమరావతి (Amaravati) లో తన సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బుధవారం (ఏప్రిల్ 9న) శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8:15 గంటలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు భూమి పూజ చేస్తారు. వెలగపూడి (Velagapudi) సచివాలయం వెనుక ఈ9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్థులు పట్టువస్త్రాలు అందించనున్నారు. రాజధాని (Capital) లో సొంతింటి నిర్మాణం కోసం చంద్రబాబు కుటుంబం రైతుల నుంచి ఐదెకరాల భూమి కొనుగోలు చేసింది.













