సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఏడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరిన ఆయన అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు రాత్రి 12 గంటలకు వచ్చారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేలా, వేలాది మందికి ఉపాధి కల్పించేలా పారిశ్రామికవేత్తలను ఒప్పించి స్వారాష్ట్రానికి తిరిగి వచ్చిన చంద్రబాబుకు మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గన్నవరం విమానాశ్రంయలో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా అనేక మంది ఎన్నారైలు ఆయనతో భేటీ అయ్యారు. ప్రధానంగా నవ్యాంధ్ర రాజధానిలో సాఫ్ట్వేర్ కంపెనీలు, సంస్థలను ఏర్పాటు చేయడానికి 21 మంది ముందుకొచ్చారు. ఏపీ ఎన్నార్టీ కన్వీనర్ డాక్టర్ రవి, అమెరికాలో ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరామ్, నాట్స్ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, తానాకు చెందిన సతీష్వేమన తదితరుల సమక్షంలో ఎన్నారైలు సీఎం చంద్రబాబుతో చర్చించి తమ అంగీకారం తెలిపారు.













