Chandrababu: బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం… రాష్ట్రంలో
ఎస్ఎల్బీసీ (SLBC) సమావేశంలో బ్యాంకర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల వ్యవహారంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆహార అలావాట్లు చాలా మారాయి. అగ్రికల్చర్ స్థానం లో హార్టికల్చర్ వస్తోంది. హార్టికల్చర్, ప్రకృతి సాగుకు బ్యాంకులు (Banks) మద్దతుగా నిలవాలి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదు. అన్నదాతల బాగు కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ఎంఎస్ఎంఈ(MSME) రుణాలను కేంద్రం సులభతరం చేసింది. గత ప్రభుత్వ ఆక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి. పీఎం (PM) సూర్యఘర్ కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యం అన్నారు.













