Chandrababu : సింగపూర్ వెళ్లి అక్కడి మంత్రులను బెదిరించారు : సీఎం చంద్రబాబు
జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిరదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మంత్రివర్గ సమావేశం(cabinet meeting) ముగిసిన అనంతరం రాజకీయాంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం (Singapore government) తేలిగ్గా అంగీకరించలేదన్నారు. వైసీపీ హయాంలో సింగపూర్ వెళ్లి మరీ అక్కడి మంత్రులను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 15న మహిళలకు ఉచిత బస్సు (free bus) ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని ఆయన ఆదేశించారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని సీఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంచి సూచన చేశారంటూ నాదెండ్లకు చంద్రబాబు కితాబిచ్చారు. ఆటోడ్రైవర్లతో మాట్లాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన దుకాణాల్లో బినామీలు వస్తే సహించబోనని సీఎం హెచ్చరించారు.







