బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక
బలహీనవర్గ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించింది. ఇక నుంచి ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు పెళ్లి ఖర్చులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తన కార్యాలయంలో బీసీ ఫెడరేషన్లు, కాపు, బ్రహ్మణ కార్పొరేషన్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వీరి సంక్షేమమే ధ్వేయంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఆదరణ పథకంలో బలహీనవర్గాలకు అత్యంత అధునాతన పరికరాలను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాపు విద్యార్థులందరికీ బీసీల మాదిరిగానే ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.













