RTC Bus: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్నికల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (Madhav) తదితరులు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. బస్సు వెళ్లే మార్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు బాణసంచా కాల్చారు. డీజే, తీన్మార్ డ్యాన్స్‌లతో సందడి చేశారు. ప్రతి సెంటర్లో థాంక్యూ సీఎం సర్ అంటూ మహిళలు నినాదాలు చేశారు.







