Nara Lokesh: మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన నారా లోకేష్

పాలకొల్లు: గౌరవ సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu) గారు, భువనేశ్వరి గారితో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడిపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కల్యాణవేదికకు వచ్చి నూతన వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.