CBN: వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం : చంద్రబాబు
వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బూత్‌స్థాయి నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్(Teleconference) నిర్వహించారు. మే 2న జరగనున్న అమరావతి (Amaravati) పనుల పున ప్రారంభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, యువత ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని నిర్మాణం ఉంటుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వం (NDA government) లక్ష్యం. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు. వచ్చే మూడేళ్లలో అమరావతిలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం అన్నారు. మే 2న అమరావతి పనుల పున ప్రారంభానికి ప్రధాని మోదీ (Prime Minister Modi) వస్తున్నారు. రూ.49,040 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. వీటితో పాటు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రంలో డీఆర్డీవో, డీపీఐపీ, నాయ్, రైల్వే ప్రాజెక్టులకు మరో రూ.57,962 కోట్ల మేర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని తెలిపారు.













