Chandrababu: మన ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వం : చంద్రబాబు

చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని సీఎం ప్రారంభంచారు. లబ్ధిదారు లకు రూ.436 కోట్లను అందించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ ఆటో డ్రైవర్ల (Auto drivers) పండగలో ఉన్నాం. ఏ కార్యాలయానికి తిరగకుండా ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్న సందర్భమిది. గత ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోలేదు. 2024 ఎన్నికలు నా చరిత్రలో ఎప్పుడూ చూడనిది. 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిపించారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం మంచి పనులు చేస్తోంది. 15 నెలల మా పాలనలో ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. సూపర్ సిక్స్ (Super Six) సూపర్ హిట్ అయింది. పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచి ఆదుకుంటున్నాం. పింఛన్ల కోసం రూ. 33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నా ఏకైక ప్రభుత్వమిది. ఇప్పుడు రోడ్లు బాగుపడ్డాయి. ప్రయాణాలకు ఇబ్బంది లేదు. ఉచిత ప్రయాణ సౌకర్యంతో మహిళలు సంతోషంగా ఉన్నారు.
ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతుయి. ఆటో డ్రైవర్లలో చాలా మంది పేద వాళ్లే ఉంటారు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తే, వారికి కొంత ఊరటగా ఉంటుంది. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనా అదే ధోరణి. గతుకుల రోడ్లతో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా ఒకటే హామీ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గతుకులే గతుకులు. మన ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వం. మీకు ఎక్కడా వేధింపులు ఉండవు. జరిమానాల జీవోలను రద్దు చేస్తాం. కానీ, ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. తిరిగేటప్పుడు మీ కదలికలన్నీ సీసీ కెమెరాల్లో (CC cameras) రికార్డు అవుతాయి. ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని కోరుతున్నా. అపుడు లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. మీ జీవితాలే కాకుండా, పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.