Chandrababu : వైసీపీ కుట్రలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు మెయిళ్లు (Emails )పెట్టడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ప్రస్తావించారు. ఏపీఎండీసీ (APMDC) బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు ఈ-మెయిళ్లు పెట్టారని తెలిపారు. వైసీపీ కుట్రలపై విచారణకు ఆదేశిస్తామని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.













