శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణదంపతులు శుక్రవారం. శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో తిరుమలకు.రావడం ఇదే ప్రథమం. మహాద్వారం వద్ద టీటీడీ ఈవో వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితులు ఎన్వీ రమణ దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేయించారు. తదనంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు మహదాశీర్వచనం చేసి, శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.