ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం
విజయవాడలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో సీజేఐ, సీఎం మొక్కలు నాటాడు.
ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ (సీజేఐ ఎన్వీ రమణను ఉద్దేశించి) ఇవాళ ఒక ఉన్నతస్థాయిలో ఇక్కడి కోర్టు భవనాన్ని ప్రారంభించడం.. రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2013లో జస్టిస్ ఎన్వీ రమణగారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం. ఇది అందరికీ గుర్తిండిపోయే ఘట్టం అని సీఎం జగన్ తెలిపారు. జ్యూడీషియరీకి సంబంధించి ప్రతీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని సీఎం పేర్కోన్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.













