ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి : జస్టిస్ ఎన్వీ రమణ
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందిస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని అన్నారు. పార్టీ ప్రారంభించిన తర్వాత నిర్విరామ కృషితో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు విశేష సేవలందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్తో కొంత సాన్నిహిత్యం ఉందన్నారు. 1989 నుంచి ఎన్టీఆర్ మనిషిగా నాపై ముద్ర వేశారు. ఆయన మనిషిగా ఉండటాన్ని నేను గర్విస్తున్నా. రాజకీయ పార్టీకి సిద్ధాంతం, క్రమశిక్షణ ఉండాలని భావించిన మహనీయుడు ఎన్టీఆర్. పదవీ విరమణ తర్వాత ఆయనపై పుస్తకం రాస్తా. తన స్వలాభం కోసం కాకుండా ప్రజా సేవ కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారు అని రమణ కొనియాడారు.













