విశాఖలో భాగస్వామ్య సదస్సు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సదస్సును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ఏపీఐఐసీ మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. 40 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో 11 అంశాలపై ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఇప్పటికే 400 అవగాహన ఒప్పందాలకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నెల 26న భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సురేష్ ప్రభు, పలువురు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.













