నారా లోకేశ్ కు సీఐడీ నోటీసులు
ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 4న ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41ఏ కింద నోటీసు జారీ చేశారు. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేశ్ కార్యాలయంలో ఉన్నారు. దీంతో సీఐడీ అధికారులు ఢిల్లీలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేశ్‌కు నోటీసులు అందజేశారు. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్మెంట్ వ్యవహారంపై గతేడాది నమోదు చేసిన కేసులో ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. సీఆర్పీసీ 41 ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రసావన రానందున ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.













