Chiranjeevi : నాగేంద్రబాబుకు నా అభినందనలు : చిరంజీవి
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) తన సోదరుడు నాగబాబు (Nagababu) కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు శాసనమండలి (Legislative Council) కి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ (MLC) గా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలిలో తొలిసారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకి నా అభినందనలు, ఆశీస్సులు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు అని తెలిపారు.













