స్పందన కార్యక్రమంలో.. ఎటువంటి స్పందన లేదు
ప్రజా సమస్యల పట్ల స్పందన కార్యక్రమంలో ఎటువంటి స్పందన ఉండడం లేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. నియోజకవర్గ సమస్యలపై స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు చింతమనేని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఇళ్ల కోసం డబ్బులు కట్టి అధికారుల చుట్టూ తిరుగడమే సరిపోతోందని అన్నారు. గత మూడేళ్లుగా అనేకసార్లు ప్రజలు స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని అన్నారు. వికలాంగులకు సైతం ఫింఛను మంజూరు చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేని జగన్ , మూడు రాజధానులు కడతానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.













