టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం…
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ మంత్రి రోజా రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు. మా తెలుగుదేశం నేతలకు రోజమ్మ ఏదో చీరలు పంపుతుందట. జబర్దస్త్ రింగుల రాణి రోజా తన భర్తకు చీర కట్టించి ఇంట్లో కూర్చొపెట్టిందన్నారు. తమ్మినేని ఓ దౌర్భాగ్యుడు. వైసీపీ నేతలు మహానాడుకు ఎంత మంది వచ్చారో చూస్తున్నారా? రాష్ట్రాన్ని వైసీనీ నాశనం చేస్తోంది. చంద్రబాబు సామాన్యుడు కాదు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి బాబు. రాబోయే పదేళ్ల ప్రగతి ఆలోచించే వ్యక్తి బాబు. బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. బాలయోగి, ఎర్రన్నాయుడు వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు.













