మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే గొప్ప… మళ్లీ ఓదార్పు ఒకటా?
జూనియర్లకూ మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. వారికి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం. సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం అని నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఐదుసార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశా. మిగిలిన వారికీ అవకాశం ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేదంటున్నారు. 25 ఏళ్లకే ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు సీనియర్లు బాధపడ్డారు? మంత్రిపదవి రానివారిని చంద్రబాబు ఓదార్చాలా? మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే గొప్ప.. మళ్లీ ఓదార్పు ఒకటా? అని వ్యాఖ్యానించారు.













