మోది పాలన వైఫల్యాలపై చైనాలో కూడా ప్రచారం: ముఖ్యమంత్రి చంద్రబాబు
మోది పాలనలో భారతదేశం గందరగోళం. నిరుద్యోగ సమస్యతో మోదిపై వ్యతిరేకత. ప్రజల్లో బిజెపి పట్ల తీవ్ర వ్యతిరేకత. చైనా గ్లోబల్ టైమ్స్ కథనాలు మోది వైఫల్యాలకు రుజువు. వీటన్నింటినీ ప్రజల్లో ప్రచారం చేయాలి. విపత్తు సాయంలోనూ ఏపిపై మోది వివక్షత. నిన్న ఎన్ డిఆర్ ఎఫ్ నిధులే ఉదాహరణ. మహారాష్ట్రకు రూ.4,717కోట్లు ఇచ్చి ఏపికి రూ.900కోట్లు మాత్రమే. 347మండలాల్లో కరవును కేంద్రంలో పట్టించుకోలేదు. తిత్లి తుపాన్ వల్ల వేలకోట్ల నష్టం వచ్చింది. పెథాయ్ తుపాన్ వల్ల ఏపి నష్టపోయింది. కానీ రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. అడుగడుగునా ఏపిపై బిజెపి వివక్షత చూపిస్తోంది. బిజెపి చిత్తుగా ఓడిపోతేనే ఏపికి న్యాయం.













