అంబేడ్కర్ కు సీఎం వైఎస్ జగన్ నివాళి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేడ్కర్ అని ముఖ్యమంత్రి కొనియాడారు. సర్వసమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేద్కర్. అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు. అంబేడ్కర్ జయంతి సందర్బంగా నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.













