12న ఐకానిక్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన?
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పవిత్ర సంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 12న శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పవిత్ర సంగమం దగ్గర శంకుస్థాపన ఫలకాన్ని ఆ రోజు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమయ్యే ఈ వంతెన అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెం నుంచి సంగమ ప్రదేశం వరకూ 3.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం సుమారు రూ.1387 కోట్లు.













