3 వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు – డా.గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు
అమరావతి: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 3,4,5 జనవరి 2026 లో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో జరుగనున్న 3 వ ప్రపంచ తెలుగు మహా సభల మూడవ రోజు జనవరి 5 వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే సమాపనోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు తెలుగు మహా సభల ప్రత్యేక సంచిక ఆంధ్ర మేవ జయతే, అలాగే 3 వ ప్రపంచ తెలుగు మహా సభల పోస్టల్ కవర్ ను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారని సమన్వయ కర్తలు శ్రీ పి. రామచంద్ర రాజు, శ్రీ. వాసిరెడ్డి విద్యా సాగర్ లు తెలిపారు.
డా.గజల్ శ్రీనివాస్
9849013697






