శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని సుప్రీంకోర్టు చీఫ్ జిస్టిస్ ఎన్.వి.రమణ దంతపులు దర్శించుకున్నారు. ముందుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి విఆర్కెకె.సాగర్, జిల్లా ఎస్పి సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి లవన్న తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ధూళి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట తెలంగాణ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దంపతులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఎపి హైకోర్టు రిజిస్ట్రార్ ఎవి రవీంద్రబాబు, ఎన్‌సి, ఎస్టి స్పెసల్ జడ్జి విఎఎల్ సత్యవతి, మొదటి అదపు జిల్లా జడ్జి బి.శ్రీనివాస్, ఆత్మకూర జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాష్ తదితరులు ఉన్నారు.













