కరోనా వేళ….చంద్రగిరి ప్రజలకు శానిటైజర్ లు పంపిణీ చేసిన చెవిరెడ్డి
కరోనా వైరస్ సోకకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించాలంటూ, అందుకోసం చంద్రగిరి ప్రజలకు దాదాపు 3 లక్షల 40వేల శానిటైజర్లను ఎమ్మెల్యే, టీటీడి బోర్డ్ సభ్యుడు. తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి దాదాపు 2 శానిటైజర్ల చొప్పున లక్షా 60 వేల ఇండ్లకు ఈ శానిటైజర్లను ఆయన పంపిణీ చేశారు. ఇదే కాకుండా నియోజకవర్గ ప్రజలకోసం ఆయన ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. అందులో భాగంగా విటమిన్ సి మాత్రలను కూడా ఆయన పంపిణీ చేశారు. దాదాపు 25 లక్షల సి విటమిన్ ట్యాబ్లెట్లను ప్రజలకు అందజేశారు.













