Miss Andhra: మిస్ ఆంధ్రాగా సాత్విక
ఫరెవర్ స్టార్ మిస్ ఇండియా అందాల పోటీల్లో చెన్నమనేని గమన స్వాతిక (Chennamaneni Gamana Swathika) మిస్ ఆంధ్ర (Miss Andhra) 2025 విజేతగా నిలిచారు. రాజస్థాన్లోని జైపూర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేఎల్ విశ్వవిద్యాలయం (KL University)లో బీటెక్ ఫైనల్ ఇయర్ సీఎస్ఈ చదువుతున్న సాత్విక ఆగస్టులో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో మిస్ తిరుపతి (Miss Tirupati)గా ఎంపికయ్యారు. మిస్ ఇండియా పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచినట్టు తెలిపారు. ఈమె తిరుపతి జిల్లా వెంకటగిరి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ సీసీ నాయుడి కుమార్తె.













