జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన మంత్రి
బీసీ శాఖ మంత్రిగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం రావటం ఆనందంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానిఫేస్టోలో పెట్టిన ఈ పథకం ఈ రోజు నుంచి అమలు కానుంది. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఐఏస్ అధికారి ప్రవీణ్ కుమార్లు, ఏపీ నాయి బ్రహ్మాణ కార్పొరేషన్ చైర్మన్ ఏనాదయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు అన్ని పథకాలు అందజేస్తామన్నారు. మొదటి విడతగా 2,57,040 మందికి ఈ పథకానికి అర్హులుగా గుర్తించి వారికి 247.04 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం అర్హులైన వారికి తగ్గించమని, జగనన్న చేదోడు పథకం ద్వారా మొదటి విడతలో 2,47,040 మంది లబ్ధి పొందారని చెప్పారు. ఇవాళ 51,390 మది లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ పథకంలో ఎటువంటి సిఫార్సులు లేకుండా కేవలం అర్హులను వెతికి పట్టుకుని మరి వారికి లబ్ది చేకూర్చుమని చెప్పారు.













