సోము వీర్రాజు ని సాగనంపుతారా…?
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర నాయకత్వం విషయంలో కేంద్ర నాయకత్వం చాలా వరకు సీరియస్ గా ఉందనే విషయం గత కొంతకాలంగా మనకు అర్థమవుతుంది. కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఆదేశాలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంలేదు. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీ బలంగా ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడాలంటే కొన్ని కొన్ని అంశాలను చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలి. కానీ బిజెపి నేతలు ఈ విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన చాలా వరకు ఉంది. అసలు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటనే దానిపై ఇప్పటి వరకు కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రణాళిక కూడా లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం కూడా ఇప్పటివరకు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ఇక్కడున్న ప్రతిపక్షాలను పదేపదే విమర్శించడంతో బిజెపిలో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు.
అయితే ఇప్పుడు బీజేపీ లో కొన్ని కొన్ని మార్పులు చేయడానికి బిజెపి కేంద్ర నాయకత్వం సిద్ధమైనట్లుగా సమాచారం. రాష్ట్ర నాయకత్వాన్ని దాదాపుగా మార్చే ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉంది. కొంతమంది బీజేపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉన్నారని, మరికొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని, రాజకీయ కారణాలతో ఇతర పార్టీలతో ఎక్కువగా స్నేహం చేసే ప్రయత్నాలను బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు చేస్తున్నారు అనే అంశాన్ని బీజేపీ అధిష్టానం గ్రహించినట్టుగా తెలుస్తోంది.
అందుకే కొంతమంది కీలక నేతలను పదవుల నుంచి తప్పించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ప్రధానంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారిని పదవుల నుంచి తప్పించడానికి రెడీ అయింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ విష్ణు కుమార్ రాజు వంటి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. కాబట్టి వాళ్లను ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. వాళ్ళు గతంలో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో కూడా దూకుడుగా వెళుతున్నారు. కాబట్టి వాళ్లకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది అనే భావనను బిజెపి అగ్రనేతలు వ్యక్తం చేస్తున్నారట.













