ఇస్రో మరో రికార్డు
ఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్-3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఎల్వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం 2:35 నిమిషాలకు రాకెట్ గాలిలోకి ఎగిరింది. ఆ తర్వాత అన్ని దశల్లోనూ ఆ రాకెట్ బూస్టర్లు సక్రమంగా మండాయి. ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-3 వెళ్తోంది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు పేలోడ్‌లో ప్రత్యేక పరికరాన్ని పంపుతున్నారు.













