ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వరంలో చంద్రన్న పెళ్లి కానుక
మాటల్లో కాదు ……..చేతల్లో చూపిస్తాం. సమాజంలో మంచి చేయడానికి అందరం బాగస్వామ్యుల మౌదాం. చంద్రబాబుకి తోడుగా నిలుద్దాం. చంద్రన్న పెళ్లికానుక ….. పేదింటి ఆడపిల్లల వివాహాన్ని మా భాద్యతగా భావిస్తూ గుంటూరు పశ్చిమ నియోజక వర్గం లో ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వరంలో చంద్రన్న పెళ్లి కానుక. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కందుకూరి గౌరి మరియు కొండెపోగు నరేంద్ర గారి వివాహం సందర్భంగా 39 వ వార్డు తెలుగుదేశం ప్రెసిడెంట్ సింగంశెట్టి వీరయ్య, ఎడ్లూరి నిరీక్షణరావు, రమేష్ నున్న, కాకర్ల శ్రీనివాస్, శివ వారి నివాసానికి వెళ్లి వారిని ఆశీర్వదించి చంద్రన్న పెళ్లికానుక 25,000 రూపాయలు అందచేశారు.
ఈ సందర్భంగా 39 వ వార్డు తెలుగుదేశం ప్రెసిడెంట్ సింగంశెట్టి వీరయ్య మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పేదింటి ఆడపిల్లలు చంద్రన్న పెళ్లి కానుక కొరకు www.cbnpk.in లో దరఖాస్తు చేసుకుంటె అర్హులైన వారికి 25000 రూపాయలు డైరెక్టుగా పెళ్లికూతురు బ్యాంకు ఖాతా లోకి జమచేయ బడతాయని తెలిపారు.
పెళ్లి కూతరు కందుకూరి గౌరి మాట్లాడుతూ చంద్రన్న పెళ్లికానుక ద్వారా సహాయమందించిన ఉయ్యూరు శ్రీనివాస్ గారికి ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్భంగా పెళ్ళి కూతురు తండ్రి కందుకూరి నాగరాజు మాట్లాడుతూ “జగన్ కు ఓటు వేస్తే జగన్ కుటుంబం బాగుపడుతుంది ……చంద్రబాబు కు ఓటు వేస్తే పేదల కుటుంబాలు బాగు పడతాయి” అని చెబుతూ తన కూతురు పెళ్లికి 25000 రూపాయలు సహాయ మందించిన ఉయ్యూరు శ్రీనివాస్ కు తమ కుటుంబం తరుపున ధన్య వాదములు తెలిపారు.
ఉయ్యూరు ఫౌండేషన్ మరియు తెలుగు దేశం అభిమానుల తరుపున కందుకూరి గౌరి మరియు కొండెపోగు నరేంద్ర గారికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్.













